తెలుగు సామెతలు - అ మరియు ఆ
* అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది.
* అంగట్లో అరువు, తలమీద బరువు.
* అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం (అష్ట దరిద్రం).
* అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది.
* అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం.
* అంగడిలో అమ్మి గొంగడి (కప్పు) కొన్నట్టు.
* అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను.
* అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు.
* అంగడివీధిలో ఆలిని పడుకోపెట్టి, వచేవాళ్ళూ పోయేవాళ్ళూ దాటిపోయినారు అన్నట్టు.
* అంచు డాబే గాని, పంచె డాబులేదు.
* అంటే ఆరడి అవుతుంది, అనకపోతే అలుసవుతుంది.
* అండలుంటె కొండలు దాటవచ్చు.
* అంతంత కోడికి అర్థసేరు మసాలా.
* అంతా ఉరిమి ఇంతేనా కురిసేది?
* అంతకు ఇంతయింది, ఇంతకెంతవుతుందో, ఇంతకింతే!
* అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
* అంతనాడులేదు, ఇంతనాడూలేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు.
* అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.
* అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
* అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
* అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
* అంతా తడిసిన తరువాత చలేమిటి.
* అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
* అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
* అంతా బావలే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
* అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
* అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
* అందని ద్రాక్షపళ్ళు పుల్లన.
* అందని ఫూలు దేవికర్పణ.
* అందని మానిపళ్ళకు ఆశపడ్డట్లు.
* అందఱికన్న తాడిచెట్టు పెద్ద.
* అందఱికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడ్డట్లు.
* అందఱికి అట్ల పండుగ, మనకి ముట్ల పండుగ.
* అందరికి అన్నం పెట్టేవడు రైతు.
* అందరికి అన్ని రోగాలు, అడ్డెడు తప్పలాకు ఏ రోగములేదు.
* అందఱిని మెప్పించటం అలవిగానిపని.
* అందఱు అందలమెక్కితే, మోసేదెవరూ?
* అందఱూ అహింసాపరులే, అయితే కొడిపెట్ట ఎక్కడపోయినట్టు?
* అందఱు శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నయి.
* అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.
* అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
* అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
* అంధునికి అద్దం చూపినట్లు.
* అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
* అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
* అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
* అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
* "అ ఆ " లు రావు అగ్రతాంబూలం కావాల
* అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
* అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
* అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
* అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
* అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
* అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
* అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
* అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.
* అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
* అగ్గువ అయితే అందరూ కొంటారు.
* అగ్నికి వాయువు తోడైనట్టు.
* అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
* అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
* అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
* అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
* అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
* అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
* అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
* అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
* అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.
* అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).
* అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.
* అటునుంచి నరుక్కురమ్మన్నారు.
* అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనపడతారు.
* అడక్కుండ చెప్పులిచాడు, అడిగితే గుఱ్రమిస్తాడని అనుకొన్నట్లు.
* అడగనిదే అమ్మయినా పెట్టదు.
* అడవిపంది చేనుమేసిపోతే, ఊరపంది చెవులు కోసినట్లు.
* అడవిని గాచిన వెన్నెల, ముదిమిని చేసున పెండ్లి.
* అడిగితే చిరాకు, అడుగకపోతే పరాకు.
* అడిగినట్లు ఇస్తే, కడిగినట్టు పోతుంది. (బేరంలో).
* అడిగేవాడికి చెప్పేవాడులోకువ.
* అడుక్కొని తినేవాడి ఆలు అయ్యేకంటె, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.
* అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.
* అతుకుల కాపురం, చిదుగుల మంటవంటిది.
* అతుకుల బొంత, గతుకుల బాట.
* అత్త కాలము కొన్నాళ్ళు, కోడలికాలం కొన్నళ్ళు.
* అత్త ఎత్తుకొని తింటుంటే, అల్లుడికి మనుగుడుపా?
* అత్తకు అల్లుడాశ, బాపనికి పప్పాశ.
* అత్తకు మొగుడల్లుడు.
* అత్తకు లేక అటికలు నాకుతుంటే, అల్లుడు వచ్చి దీపావళిపండుగ అన్నడుట.
* అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?
* అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.
* అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.
* అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు.
* అత్తను ఉంచుకొన్నవాడు ఆయుష్మంతుడు.
* అత్తని కొట్టి అటకెక్కింది, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది.
* అత్తని కొడితే కోడలేడ్చినట్లు.
* అత్త పెట్టే ఆరళ్ళు కనపడతాయి కాని, కోడలు చేసే కొంటెపనులు కనపడవు.
* అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు.
* అత్తముండ కన్నా ఉత్తముండ మేలు.
* అత్త ఱంకుబోతు, కోడలికి చెప్పినట్లు.
* అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.
* అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.
* అత్త వల్ల దొంగతనము, మగనివల్ల ఱంకుతనము (నేర్చుకోన్నట్లు).
* అత్తవారింటికి అల్లుడైనా రావాలి, ఆబోతైనా రావాలి.
* అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.
* అత్తవారింటి లేమి అల్లుడెరుగు.
* అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.
* అత్త సొమ్ము అల్లుడు ధారవోసినట్లు (దానం చెసినట్లు).
* అత్తది అల్లుడు దానం చేసినట్లు.
* అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
* అత్త నీ కొంగు తప్పిందన్న తప్పే, లేదన్న తప్పే (ఊరకున్నా తప్పే).
* అత్తింటి కాపురం కత్తిమీది సాము.
* అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
* అదిగోపులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.
* అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.
* అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పుని విడవమన్నారు.
* అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.
* అదృష్టం కలిసివస్తే అదే (ఆలే) పెండ్లామవుతుంది.
* అదృష్టం చాలని ఆడుబిడ్డను అక్కఱలెని అల్లునికిచ్చి, అమావాస్య ఆదివారం నాటి ఆరుద్రానక్షత్రాన అతివైభవంగా వివాహం జరిపినట్లు.
* అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.
* అదృష్టం పండితే ఆరునూరవుతాయి.
* అదృష్టం అందల మెక్కిస్తాను అంటే, బుధ్ధి బురదలోకి లాక్కెళిందంట.
* అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
* అద్దం ఉంది అందమడుగనేల?
* అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు.
* అద్దం లో నీడకు ఆశ పడరాదు.
* అద్దెకు వచ్చిన గుఱ్ఱాలు అగడ్తలు దాటునా?
* అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
* అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
* అధర రసము చూచి అన్నీ మరచును.
* అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.
* అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
* అధికాశ లోకదరిద్రం.
* అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.
* అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
* ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.
* అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.
* అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
* అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
* అనుమానం ప్రాణసంకటం.
* అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
* అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
* అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
* అనువుగాని చోట అధికులమనరాదు.
* అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
* అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
* అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
* అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
* అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడనక్కరలేదు.
* అన్నం ఊడికినాక పొయ్యి మండుతుంది.
* అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
* అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.
* అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
* అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.
* అన్నం లేకపోయిన పట్టుబట్ట.
* అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
* అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.
* అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.
* అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
* అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
* అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.
* అన్నరసం కన్న, ఆదరణ రసం మేలు.
* అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.
* అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగిచచ్చారు.
* అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.
* అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.
* అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.
* అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.
* అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
* అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
* అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
* అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.
* అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
* అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
* అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
* అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.
* అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
* అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.
* అపానవాయువు వదలితే - అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః - అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.
* అపుత్రస్య గతిర్నాస్తి.
* అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
* అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.
* అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
* అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
* పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
* అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.
* అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
* అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
* అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.
* అప్పు చేసి పప్పు కూడు.
* అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
* అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.
* అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
* అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
* అప్పులేనివాడు అధిక బలుడు.
* అబద్ధం అంటే అతుకుల మాట
* అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
* అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.
* అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
* అబధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.
* అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.
* అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
* అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
* అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.
* అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
* అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?
* అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.
* అబ్బలేని బిడ్డ, గట్లు లేని చేను.
* అబ్బలేని బిడ్డ, మబ్బులేని (విడిచిన) ఎండ.
* అబ్బాయి పోతురాజు, అమ్మయి గంగానమ్మ.
* అబ్బితే సిగ, అబ్బకపోతే కాళ్ళు.
* అబ్బురాన అబ్బికి మీసాలు వస్తే, అవి ఈచేతా ఆ చేతా సాగతీసె సరికి ఊదిపోయినవట. వట్టి మూతికి ఒక చేయి చాలునని రెండోదానితో తల గోక్కున్నాడట.
* అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
* అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
* అభ్యాసం కూసువిద్య.
* అభ్యాసం లేని రెడ్డి అందలం ఎక్కితే అటు ఇటు అయ్యిందట.
* అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.
* అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
* అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
* అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
* అమ్మతాపెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
* అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
* అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.
* అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
* అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు.
* అమ్మ పెట్టేవి నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
* అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
* అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
* అమ్మయినా అడగందే పెట్టదు.
* అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
* అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
* అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
* అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
* అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
* అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
* అయితే అమీరు, కాకుంటే గరీబు.
* అయిన పెండ్లికి మేళమా?
* అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
* అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
* అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.
* అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.
* అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.
* అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.
* అయినవాళ్ళను అవతలకి నెట్టి కానివాళ్ళ కాళ్ళు పట్టుకొన్నట్లు.
* ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.
* అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
* అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
* అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
* అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
* అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
* అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
* అయ్య తిరుపతి, అమ్మ పరపతి.
* అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
* అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం.
* అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
* అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
* అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
* అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
* అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
* అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
* అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
* అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.
* అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
* అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
* అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
* అరిచే కుక్క కరవదు.
* అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
* అరచేతిలో వైకుంఠం చూపినట్లు.
* అరటాకు మీద ముల్లుపడ్డా ముల్లు మీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు.
* అరటికాయ ఆరునెలల రోగం.
* అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
* అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
* అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
* అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
* అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
* అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
* అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
* అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
* అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
* అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
* అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
* అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
* అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
* అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.
* ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.
* అలంకారం కంటె, అయిదవతనం మేలు.
* అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.
* అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.
* అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.
* అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.
* అలవి మీరితే అమృతం అయినా విషమే.
* అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.
* అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.
* అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.
* అలిగిన ఆలు, తడిసిన మంచము బిగుసుకుంటవి.
* అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
* అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.
* అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.
* అల్పనరులకెల్ల నతివలపై చింత.
* అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
* అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను.
* అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.
* అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.
* అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.
* అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.
* అల్లుడిని చూసి 'ఈయన నా కూతురి మొగుడూ తోడి పెండ్లికొడుకును చూసి 'ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ అన్నడుట.
* అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
* అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.
* అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
* అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.
* అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?
* అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!
* అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
* అవ్వా కావాలి బువ్వా కావాలి.
* అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.
* అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.
* అసత్యమాడుట పిరికిపందల గుణం.
* అసలుకంటే వడ్డి ముద్దు.
* అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
* అసలు మూడుపాళ్ళు, వడ్డి ఆరుపాళ్ళు.
* అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది: పైన తేలు కుట్టింది.
* అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.
* అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
* అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
* అసూయ ముందు, ఆడది వెనుక.
* అస్తమానం అరచే పిల్లి ఎలుక పట్టలేదు.
* * * * * * * * * * :: ఆ ::* * * * * * * * * *
* 'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
* 'ఆఁ' అంటె ఆరునెలలు.
* 'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
* ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
* ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
* ఆ ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.
* ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
* ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.
* ఆకలని రెండు చేతులతో తింటారా?
* ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
* ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.
* ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.
* ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
* ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
* ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
* ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
* ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
* ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
* ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
* ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
* ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
* ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.
* ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
* ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.
* ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
* ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.
* ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
* ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.
* ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.
* ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.
* ఆడబిడ్డ అర్థ మొగుడు.
* ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.
* ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
* ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
* ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
* ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
* ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
* ఆడింది ఆట, పాడింది పాట.
* ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
* ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
* ఆ తండ్రి కొడుకు కాదా?
* ఆ తానులోదే ఈ పీలిక.
* ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
* ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
* ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
* ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
* ఆదిలోనే హంసపాది (దు).
* ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
* ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
* ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
* ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
* ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
* ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
* ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
* ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
* ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
* ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
* ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
* ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
* ఆరాటమే గానీ పోరాటం లేదు.
* అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
* ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
* ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
* ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
* ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
* ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.
* ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
* ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
* ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
* ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
* ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
* ఆలపాటి కవిత్వం , అందులో పైత్యం
* ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
* ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
* ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.
* ఆలికి లొంగినవాడు ఆరగాణిలో పడినవాడు అటిటు అవుతాడు.
* ఆలితో కలహించి ఆకలికాదని పస్తుండెడివాడు పంజు వెధవ.
* ఆలిని అదుపులో పెట్టలేనివాడు, అందరినీ అదుపులో పెట్టునా?
* ఆలిని విడిస్తే హరిదాసు, సంసారం విడిస్తే సన్యాసి.
* ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
* ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.
* ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.
* ఆలి శుచి ఇల్లు చెపుతుంది.
* ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకురావు.
* ఆలి ఒల్లక అరవై ఏళ్ళు, మొగుడుఒల్లక ముప్పై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు.
* ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
* ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
* ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
* ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
* ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
* ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
* ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
* ఆలుమగని సందు ఆరామడల దూరం.
* ఆలు లేత, నారు ముదురు కావాల.
* ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
* ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.
* ఆలు సొత్తు, అత్త తొత్తు.
* ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.
* ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)
* ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
* ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.
* ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
* ఆవు తొలిచూలు, గేదె మలిచూలు
* ఆవు నలుపైతే పాలు నలుపా?
* ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
* ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
* ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
* ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
* ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
* ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
* ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
* ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
* ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
* ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
* ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
* ఆవులేని ఇంట అన్నమే తినరాదు.
* ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
* ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
* ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
* ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
* ఆశ ఆలిమీద, పడక చాపమీద.
* ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
* ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
* ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
* ఆశకుపోతే గోచీ ఊడిందట.
* ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
* ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
* ఆశకు దరిద్రానికి లంకె
* ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
* ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
* ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
* ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
* ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
* ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
* ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
* ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.
* ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.
* ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.
* ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.
* ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.
* ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.
* ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.
* ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.
* ఆశ్లేష వర్షం అందరికీ లాభం.
* ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.
* ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).
* ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.
* ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.
* ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.
* ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.
* ఆసలు విడిస్తే అటమట లేదు.
* ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.
* ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.
* ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.
* ఆస్థికొక పుత్రుడు, ప్రేమకొక పుత్రిక.
* ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొగమాటం (సంకోచ) పడరాదు.
No comments:
Post a Comment